KMR: సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ సోమవారం పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తున్నట్లు జిల్లా జేఏసీ ఛైర్మన్ నరాల వెంకట్ రెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ కార్యాలయంలో నేడు ఉదయం 12 గంటలకు ఉద్యోగులు నల్లచొక్క లేదా టీషర్ట్ ధరించి నల్ల బ్యాడ్జిలతో పాత పెన్షన్ సాధన కోసం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.