నాగర్ కర్నూల్ నుంచి హైదరాబాద్ రహదారి, పలు గ్రామీణ రహదారులు వర్షాల వల్ల గుంతలు ఏర్పడ్డాయి. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరుగుతుంది. దీంతో స్థానికులు రోడ్డుపై గుంతలో మొక్కలు నాటి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేసి బారికేడ్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.