ELR: నూజివీడు పట్టణ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల నెట్వర్క్ ఇవాళ మొరాయించింది. ప్రతి నెల 1వ తేదీ ఉదయమే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేపడతారు. అదే క్రమంలో సోమవారం ఉదయమే సెప్టెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించేందుకు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వచ్చి ప్రయత్నించగా సర్వర్ మొరాయించడం కనిపించిందని తెలిపారు.