కృష్ణా: ఉంగుటూరు మండలం పొట్టిపాడుకు చెందిన ఐదేళ్ల చిన్నారి బొమ్మినేని లిఖిత తన నృత్యంతో అందరినీ మంత్ర ముగ్ధులను చేస్తోంది. ఆదివారం ఆత్కూరు రామాలయంలో జరిగిన కార్యక్రమంలో పౌర్ణమి సినిమాలోని పాటకు అచ్చుగుద్దినట్లుగా ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. చిన్న వయసులోనే ఇంత నైపుణ్యం చూపిన లిఖితను చూసి వచ్చిన వారు ఆశ్చర్యపోతున్నారు.