సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. ఉ.7 గంటలకు కొత్తచెరువులోని కొడపగానిపల్లి ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే పర్యటించి దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు పింఛన్ మొత్తం పంపిణీ చేశారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా పింఛన్ ఇస్తున్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు.