KMR: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్‌లో పిట్లం మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన వంశీ అదరగొడుతున్నాడు. రాములు కుమారుడైన వంశీ, అనంతగిరి హాక్స్ జట్టులో ఆల్ రౌండర్‌గా సత్తా చాటుతున్నాడు. చిన్నతనం నుంచే కబడ్డీపై ఆసక్తి పెంచుకున్న వంశీ, ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగాడు. అతడి ప్రతిభను గుర్తించిన అనంతగిరి హాక్స్ యాజమాన్యం తమ జట్టులోకి తీసుకుంది.