VZM: పార్వతీపురం మండలం బూర్జ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఇవాళ పాల్గొన్నారు. గ్రామంలో స్వయంగా ఇంటింటికీ వెళ్లి బడుగు, బలహీన వర్గాలకు చెందిన వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు కలెక్టర్ పింఛన్లు అందించారు. పింఛన్లు కేవలం సంక్షేమం మాత్రమే కాదని ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను వ్యక్తం చేస్తుందని తెలిపారు.