నెల్లూరు: ఆదివారం రాత్రి జరిగిన వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. గణనాథుడి చల్లని చూపుతో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. నెల్లూరు పెన్నా ఘాట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నిమజ్జనోత్సవ ఘాట్‌ను సందర్శించారు.