ఇటీవల జరిగిన పహల్గామ్ దాడి ఉగ్రవాదుల పైశాచికత్వాన్ని చాటిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఈ సందర్భంగా పాక్ వైఖరిని ప్రధాని ఎండగట్టారు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగానే మద్దతిస్తున్నాయంటూ పాక్ ప్రధాని షరీష్ సమక్షంలోనే ఆ దేశ వైఖరిని తప్పుబట్టారు. అనంతరం పహల్గామ్ దాడి వేళ భారత్కు మద్దతుగా నిలిచిన దేశాలకు మోదీ కృతజ్ఞతలు చెప్పారు.