ATP: సాగు, తాగు నీటి కేటాయింపుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏపీ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక కార్యదర్శి సాకే హరి మండిపడ్డారు. ఆదివారం కదిరి ఎన్జీవో హోంలో జరిగిన సాగునీటి ప్రాజెక్టులు విభజన హామీలు అన్న అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులను నీటితో నింపాలని డిమాండ్ చేశారు.