GNTR: మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో ప్రజల సౌకర్యార్థం ఈ-టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశారు. మంత్రి లోకేశ్ చొరవతో సెల్కాన్ సీఎస్ఆర్ నిధులతో వీటిని ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ అలీం బాషా తెలిపారు. గౌతమ్ బుద్ధ రోడ్డు వెంబడి కాళికామాత ఆలయం వద్ద సోమవారం వీటిని ప్రారంభించారు. పురుషులు, మహిళలు, దివ్యాంగులు సైతం వీటిని ఉపయోగించుకోవచ్చు.