WNP: కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ‘నేరపూరిత నిర్లక్ష్యం’ అని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డలోని రెండు పిల్లర్లను ప్రాజెక్టు నిర్మించిన ఎల్ & టీ సంస్థ బాగుచేస్తానన్నా ప్రభుత్వం అడ్డుకుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.