బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఇవాళ మరోసారి గోల్డ్ ధరలు భగ్గుమన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.850 పెరిగి రూ.97,050లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.930 పెరిగి రూ.1,05,880 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,36,000గా ఉంది.