BDK: లక్ష్మీదేవి పల్లి మండలం ఇల్లందు క్రాస్ రోడ్ సెంట్రల్ పార్క్ ఎదురుగా రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిందని ప్రయాణికులు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి ప్రమాదం జరగక ముందే ఆ చెట్టును తొలగించాలని కోరారు. అటుగా వెళ్లే వాహనాలు పొరపాటున చూసుకోకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.