AP: తెలుగువారి జయకేతనాన్ని విశ్వవ్యాప్తంగా ఎగురవేసిన నాయకుడు సీఎం చంద్రబాబు అని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. 30 ఏళ్ల ప్రస్థానంలో రాష్ట్ర ప్రగతికే చంద్రబాబు అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో 3 దశాబ్దాల కృషితో సుస్థిర ప్రగతికి మార్గదర్శకుడిగా నిలిచారని కొనియాడారు. నిత్యం ప్రజల సంతోషం కోసమే ఆలోచిస్తారని చెప్పారు.