TG; రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి భూముల ధరలు భారీగా పెరిగాయి. ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ విలువను 50 నుంచి 100 శాతం వరకు సవరించగా, ప్రైమ్ ఏరియాల్లో ఏకంగా 100 శాతం పెంచారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1200 కోట్ల నుంచి రూ.1400 కోట్ల వరకు అదనపు ఆదాయం రానుంది. అయితే రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.