ప్రతిరోజు 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడంలో ఇది తోడ్పడుతుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంతో పాటు గుండె సమస్యలు రాకుండా చేయడంలో సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కండరాలను దృఢంగా చేస్తుంది. తద్వారా బాడీ ఫిట్‌గా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.