AP: విజయనగరం ఉగ్రకుట్ర కేసులో ఎన్ఐఏ (NIA) కీలక అడుగు వేసింది. ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబు తాలిబ్, పరారీలో ఉన్న ఇమ్రాన్ అక్రమ్లపై అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వీరిపై బీఎన్ఎస్, పేలుడు పదార్థాల చట్టం, మరియు UAPA లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఉగ్ర కార్యకలాపాల నిరోధమే లక్ష్యంగా దర్యాప్తు కొనసాగుతోంది.