AP: మాజీ సీఎం జగన్కు రాజకీయ పరిజ్ఞానం లేదని MLA కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అన్ని పార్టీల అనుమతితోనే రాజధాని అమరావతిని ప్రకటించారన్నారు. అప్పుడు జగన్ అమరావతికి అంగీకరించారని, ఒక్క అవకాశం ఇస్తే రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తానంటూ ప్రజలను మోసం చేశారన్నారు. చట్టబద్ధత బిల్లు ఆమోదం సమయంలో YCP ఎంపీలు వాకౌట్ చేయడం సిగ్గుచేటన్నారు.