TG: మన హైదరాబాద్ గొప్ప, చారిత్రాత్మక, అందమైన, సుందరమైన నగరం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి కన్నా సుందరమైన ప్రాంతం ప్రపంచంలోనే లేదన్నారు. గతంలో సినిమా షూటింగ్‌ల కోసం విదేశాలకు వెళ్లేవారని అన్నారు. మంచి ప్రభుత్వం ఉంటే.. ప్రపంచంతో పోటీ పడే నగరాన్ని తయారు చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్‌ను అందంగా తయారు చేసుకుందామంటే కొందరు అడ్డుపడుతున్నారని విమర్శించారు.