పలు దేశాలపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ టారిఫ్ల ప్రతికూల ప్రభావాన్ని తట్టుకునే స్థితిలో భారత్ ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ వెల్లడించింది. స్వదేశీ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం అందుకు కారణాన్ని తెలిపింది. అంతేకాదు ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు ఫలిస్తే భారత్ ఉత్పత్తులు అమెరికాకు భారీగా ఎగుమతి అవుతాయని సదరు సంస్థ అంచనా వేసింది.