TG: దేశ తపాలా శాఖ తన సేవల్లో కీలక సంస్కరణలను చేపట్టింది. అత్యవసర, సమయానికి చేరాల్సిన సరుకుల కోసం 24, 48 గంటల డెలివరీ హామీలతో మూడు ప్రీమియం సేవలను తీసుకొచ్చింది. 24 స్పీడ్ పోస్ట్, 24 స్పీడ్ పోస్ట్ పార్శిల్, 48 స్పీడ్ పోస్ట్ వంటి సేవలను కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు.