చాలామందికి వెక్కిళ్లు ఆగవు. అయితే కొన్ని చిట్కాలతో ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. ఒకే శ్వాసలో గ్లాసుడు చల్లని నీరు తాగాలి. గాలిని గట్టిగా పీల్చి, 10-20 సెకన్ల పాటు ఆపి ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. లేదంటే ఒక స్పూన్ పంచదారను నాలుకపై వేసుకుని చప్పరించాలి. చిన్న నిమ్మ చెక్కను కొరకడం వల్ల వెక్కిళ్లు వెంటనే ఆగిపోతాయి.