వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో హింస సంస్కృతిని పెంపొందించిందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. న్యాయం కంటే అధికారానికే వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. దళిత యువకుడు దుర్గా ప్రసాద్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోయారని అన్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో దుర్గాప్రసాద్ కుటుంబం ఫిర్యాదు చేసిందని, ఈ హత్య కేసులో శ్రీకాంత్, వద్ది ధర్మేశ్లను పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.