ఆస్ట్రేలియా పార్లమెంట్లో బ్రిటిన్ రాజు కింగ్ ఛార్లెస్-3కు చేదు అనుభవం ఎదురయింది. ఆస్ట్రేలియాకు అధికారికంగా పాలకుడైన ఛార్లెస్-3 పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడారు. అతను మాట్లాడిన వెంటనే ఆదివాసీ మహిళా నేత థోర్పే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘మా నుంచి దోచుకున్నవి వాపస్ ఇవ్వండీ. ఇది మీ భూమి కాదు.. మీరు మా రాజు కాదు. ఆదివాసీలపై వలసదారులు నరమేధానికి పాల్పడ్డారు’ అని కేకలు కేకలు వేశారు.