ప్రముఖ మొబైల్ యాప్ వాట్సాప్(whatsapp) సేవలకు అంతరాయం కలిగింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి వాట్సాప్ పనిచేయడం లేదు. మెసేజ్ వెళ్లడం కానీ… కాల్ రావడం కానీ ఏమీ జరగడం లేదు. దీంతో… యూజర్లు చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఉపయోగించేవారు. కమ్యూనికేషన్ కి వాట్సాప్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అలాంటిది ఒక్కసారిగా పనిచేయడం మానేయడంతో యూజర్లు తెగ ఇబ్బందిపడుతున్నారు. తమ అసహనాన్ని మొత్తాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.
వాట్సాప్ వెబ్ కు కనెక్ట్ చేస్తున్నప్పుడు కనెక్టింగ్ అని వస్తున్నట్లు కొందరు యూజర్లు చెబుతున్నారు. యాప్ ఓపెన్ అవుతుంది గానీ, మీడియా ఫైల్స్ ను పంపలేకపోతున్నామని తెలిపారు. 69 శాతం మంది వినియోగదారులు సందేశాలను పంపడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. 21 శాతం మందికి సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలు ఎదురయ్యాయి. 9 శాతం మంది స్మార్ట్ ఫోన్ యాప్ తో ఇతర తెలియని సమస్యలతో ఇబ్బందిపడ్డారు.
వాట్సాప్ డౌన్ అనేది సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ అయింది. వాట్సాప్ దీనిపై ఇంకా స్పందించలేదు. సేవలకు అంతరాయం ఏర్పడడానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదు.