యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రిజల్ట్ రిలీజ్ అయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పీడీఎఫ్ ఫైల్ (PDF FILE) ఫార్మాట్లో మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పొందుపరిచారు. ప్రిలిమ్స్ (Prelims) పరీక్షలో మొత్తం 14,624 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 1105 పోస్టులకుగానూ సెప్టెంబరు 15 నుంచి మెయిన్స్ (mains) పరీక్షలు జరగనున్నాయి.
ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం ఇప్పుడు మళ్లీ డిటైల్డ్ అప్లికేషన్ (Detailed application) ఫామ్ – 1 (DAF-I)లో దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్పీ పెర్కోన్నది. అందుకు చివరి తేదీని కమిషన్ త్వరలోనే వెల్లడించనుంది. ప్రిలిమ్స్ కటాఫ్, ఆన్సర్ కీ(Answer Key)ని సివిల్స్ సర్వీసెస్ పరీక్ష మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత వెల్లడించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 28న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ (Ifs) ఫలితాలను కూడా నేడు విడుదల చేశారు.