ఆర్థిక పరంగా సెప్టెంబర్ (September) నెలలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. వీటిలో కొన్ని నెల మొదటి రోజు నుండి అమలులోకి వస్తుండగా.. మరికొన్ని నెల చివరలో వచ్చే అవకాశం ఉంది. వీటిలో అతి ముఖ్యమైన విషయాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాంరూ.2,000 నోట్లు మార్చుకున్నారా? చలామణి నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ (RBI) మే 19న ప్రకటించిన విషయం తెలిసిందే. ఉన్న నోట్లను మార్చుకోవడం లేదా ఖాతాలో డిపాజిట్(Deposit) చేసేందుకు నాలుగు నెలల గడువు ఇచ్చింది. ఈ గడువు సెప్టెంబరు 30తో ముగియనుంది (September Deadline).మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ మదుపర్లు నామినీని ఎంచుకోవడానికి సెప్టెంబరుతో గడువు (September Deadline) ముగియనుంది.
కొన్ని బ్యాంకులు తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్డ్ (Fixed) డిపాజిట్ పథకాల్లో మదుపు చేసేందుకూ సెప్టెంబరే చివరి నెల. ఇలా 2022 అక్టోబర్ 1 తర్వాత ఫోలియో జనరేట్ అయిన కొత్త మ్యూచువల్ ఫండ్ (Mutual fund) మదుపర్లకు నామినీ ఎంచుకోవడమో లేదా వద్దనుకుంటున్నట్లో ధ్రువీకరించాలి. అంతకంటే ముందు నుంచి ఫండ్లలో మదుపు చేస్తున్నవారు నామినీని ఎంచుకోవడంగానీ లేదా వద్దనుకుంటున్నామనిగానీ ధ్రువీకరణ సమర్పించాలి. దీనికి సెప్టెంబరు 30 తుది గడువు. తర్వాత ధ్రువీకరణ సమర్పించనివారి ఖాతాల్లో నిర్వహణ నిలిచిపోతుంది. స్టాక్ మార్కెట్ మదుపర్లకు సైతం ఇది వర్తిస్తుంది. లేదంటే డీమ్యాట్(Demat), ట్రేడింగ్ ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు సెప్టెంబరు 14తో ముగియనుంది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) మార్చి 15 నుంచి ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువును ఇప్పటికే అనేక మార్లు పొడిగించింది. ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవాలనుకునేవారు వెంటనే ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోండి. గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.మరో కీలకమైన గడువు ఏంటంటే.. ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల కోసం నామినేషన్ సౌకర్యం కల్పించింది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI). ఈ ఏడాది మార్చిలో, థీసిస్ హోల్డర్లు నామినేషన్లు చేయడానికి, వైదొలగడానికి సమయాన్ని పొడిగించింది. ఈ నెల అంటే సెప్టెంబర్ 30 వరకు ఇందుకోసం గడువునిచ్చింది.