యూపీ రాయ్ బరేలీ(Rae Bareilly)లో దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది. బాయ్ ఫ్రెండ్ ను కలిసేందుకు అడ్డుపడుతోందన్న కారణంతో కన్న తల్లికి విషమిచ్చింది ఓ కసాయి కుతురు. కొంతకాలంగా అమ్మాయి ఓ అబ్బాయితో చనువుగా ఉంటోంది. ఈ విషయం గమనించిన తల్లి సంగీతా యాదవ్(Sangeeta Yadav)… కుమార్తెను మందలించింది. ఆ అబ్బాయిను కలుసుకోవద్దని ఆంక్షలు విధించింది. దాంతో కుమార్తె తల్లిపై కోపం పెంచుకుంది. లవర్(Lover)కు , తనకు మధ్య తల్లి అడ్డుగా ఉందని భావించి తీవ్ర నిర్ణయం తీసుకుంది.
తల్లిని అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ గీసింది. మార్కెట్ (Market) నుంచి విషం తీసుకుని రావాలని తన బాయ్ ఫ్రెండ్ కు చెప్పింది. తల్లి తాగే టీలో విషం కలిపి ఇచ్చింది. ఆ టీ తాగిన తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయితే, ఈ పరిణామంతో భయపడిపోయిన కుమార్తె పొరుగువారికి విషయం చెప్పింది. దాంతో వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలకు ముప్పులేదని పోలీసులు (Police) తెలిపారు. ఈ వ్యవహారంలో పోలీసులు టీనేజ్ అమ్మాయి, ఆమెకు సహకరించిన ప్రియుడిపై సెక్షన్ 328 కింద కేసు నమోదు చేశారు. బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, పరారీలో ఉన్న బాయ్ ఫ్రెండ్ (boy friend) కోసం గాలింపు చేపట్టారు.