ముదిరాజ్(Mudiraj) లను బీసీ – డీ నుండి బీసీ- ఏ కేటగిరీలోకి చేరాలని బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం సికింద్రాబాద్(Secunderabad)లోని పరేడ్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ(Telangana)లో ముదిరాజ్‌లు 11 శాతం ఉన్నారని.. కానీ ముదిరాజ్‌లను రాజకీయంగా ఏ పార్టీ ఆదరించడం లేదన్నారు.
జనాభా ప్రాతిపదిక ప్రకారం ముదిరాజ్‌లకు 11 సీట్లు ఇవ్వాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల (MLA Etala) రాజేందర్ డిమాండ్ చేశారు. బీసీలకు 9 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటే.. కేవలం మూడు పదవులు మాత్రమే ఇచ్చారన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ(Telangana)లో ముదిరాజ్‌లు 60 లక్షల జనభా ఉన్నారని.. కానీ ముదిరాజ్‌లను రాజకీయంగా ఏ పార్టీ ఆదరించడం లేదన్నారు. ముదిరాజ్‌లను బీసీ – డీ నుండి బీసీ- ఏ కేటగిరీలోకి చేరాలని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజ్‌లకు ఒక్క సీటు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బానిసలుగా బతుకుదామా.. పిడికిలెత్తి ముందుకు వెళ్దామా అని ముదిరాజ్‌లను ఉత్తేజపరిచారు. ఓట్లు మావే-సీట్లు మావే అని నినాదం ఇవ్వాలని సూచించారు. అన్ని పార్టీల్లో ముదిరాజ్‌లకు సీట్లు కేటాయించాలని.. అంతేకాకుండా మత్య్సకార రక్షణ చట్టం, ముదిరాజ్ కార్పొరేషన్ (Corporation) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఈటల డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజ్‌లకు ఒక్క సీటు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, ఈ సభను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారని.. ఈ మీటింగ్‌కు వెళ్తే ప్రభుత్వ పథకాలు (Government Schemes) రావని బెదిరించారని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన అన్నింటిని ఎదుర్కొని ముదిరాజ్ ఆత్మగౌరవ సభకు భారీగా తరలివచ్చారన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితం అందరికి తెలుసని.. తాను ప్రజల మనిషినన్నారు. 14 ఏళ్లు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడానని గుర్తు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, గుండాలు చంపుతానని బెదిరించిన వెనక్కి తగ్గలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని కులాల సమస్యలపై గొంతెత్తి పోరాడానని అన్నారు.