పంజాబీ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ప్రఖ్యాత పంజాబీ గాయకుడు సురీందర్ షిండా(Surinder Shinda) కన్నుమూశారు.ఇటీవల సురిందర్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మోడల్ టౌన్ హాస్పిటల్లో చేరాడు. ఆయనను 20 రోజుల పాటు వెంటిలేటర్ పై ఉంచారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం (Health) పూర్తిగా క్షిణించి తుదిశ్వాస విడిచారు. సురీందర్ షిండాకు రెండు నెలల క్రితం ఆరిసన్ హాస్పిటల్లో చిన్న శస్త్రచికిత్స జరిగింది. శస్త్ర చికిత్స తర్వాత ఆయనకు శ్వాస సంబంధింత వ్యాధి భారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడలేదు. పంజాబ్(Punjab)లోని లూథియానా జిల్లా, చోటి అయాలీ గ్రామంలో సురీందర్ షిండా మే 20,1959న జన్మించారు. చిన్నతనం నుంచే ఆయన సింగర్ గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.
సీనీ ఇండస్ట్రీలో గాయకుడిగానే కాకుండా నటుడిగా ‘పుట్ జట్టన్ దే’, ‘ఉచా దర్ బాబే నానక్ దా’ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ‘జియోనా మోర్’ , ‘బద్లా లే లయీన్ సోహ్నేయా’ పాటలతో బాగా పాపులర్ అయ్యారు. ఆయన మృతిపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Man) ట్విట్వర్ వేధికగా సంతాపం తెలిపారు. ‘ప్రముఖ గాయకుడు, నటుడు సురీందర్ షిండాజీ మరణ వార్త వినగానే చాలా బాదపడ్డాను. పంజాబ్ లో ఓ గొప్ప స్వరం శాశ్వతంగా నిశ్శబ్ధం అయ్యింది.. షిండాజీ భౌతికంగా మన మధ్య లేకున్నా.. ఆయన గానం ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా’ అంటూ సీఎం ట్విట్ చేశారు. సురీందర్ షిండా సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. గతంలో షిండా ఆరోగ్యంపై సోషల్మీడియా(Social media)లో తీవ్ర వదంతులు వ్యాపించాయి. షిండా అనారోగ్యంపై వచ్చిన వదంతులపై ఆయన కుమారుడు మణిందర్ షిండా వివరణ ఇచ్చారు.