ఇవాళ దేశమంతా 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర పరేడ్ ను నిర్వహించారు. అందరూ జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. సాయంత్రం అటారి, వాఘా బార్డర్ లోనూ బీటింగ్ రీట్రీట్ సెరమనీ జరిగింది. కానీ.. మన దేశంలో బీహార్ రాష్ట్రంలో పాకిస్తాన్ జెండా ఎగిరింది. పాకిస్తాన్ జెండా రెపరెపలాడటం స్థానికంగా కలకలం సృష్టించింది.
బీహార్ లోని పుర్నియాలో ఉన్న మధుబని సిపాహి టొలా ఏరియాలో ఓ ఇంటి మీద పాకిస్తాన్ జెండాను భారత గణతంత్ర దినోత్సవం నాడు ఎగురవేశారు. పాకిస్తాన్ జెండా ఎగరడం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే పాకిస్తాన్ జెండాను తొలగించారు. అక్కడ ఎవరు జెండా ఎగురవేశారు? అనే దానిపై ఆరా తీస్తున్నారు. జెండా ఎవరు ఎగురవేసినా వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మధుబని ఇన్ స్పెక్టర్ పవన్ చౌదరి హెచ్చరించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
Bihar | A Pakistani flag was hoisted in the Madhubani Sipahi Tola area in Purnea
We reached the suspect's house after getting the information. The flag has been removed. The matter has been discussed with SDO Purnea. Action will be taken: Pawan Chowdhary, SHO Madhubani pic.twitter.com/xKLeN748Wl