ADB: ఆదిలాబాద్ పట్టణంలోని AR హెడ్ క్వాటర్స్‌లో నేడు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సుమారు 50 వరకు కంపెనీలు ఇందులో పాల్గొని దాదాపు 2,000 మందిని భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.