»Good News For The Unemployed Notification Release For 9212 Crpf Posts
CRPF : నిరుద్యోగులకు గుడ్ న్యూస్…. 9,212 CRPF పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు (unemployed) కేంద్రం గూడ్ న్యూస్ చెప్పింది.సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(CRPF)లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9,212 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల (Notification release) చేశారు. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 27నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని సీఆర్పీఎఫ్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం వెల్లడించింది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు (unemployed) కేంద్రం గూడ్ న్యూస్ చెప్పింది.సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(CRPF)లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9,212 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల (Notification release) చేశారు. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 27నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని సీఆర్పీఎఫ్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. ఈ పోస్టులకు పురుషులు, మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఒకటి. ఇది భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తారు. వ్రాత పరీక్ష, PET & PST, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ , డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. CRPF కానిస్టేబుల్ 9212 కానిస్టేబుల్ ఖాళీల కోసం టెక్నికల్ మరియు ట్రేడ్స్‌మన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
CRPF రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్‌ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అధికారిక వెబ్సైట్ www.crpf.nic.inలో చూడొచ్చు.మొత్తం 9212 పోస్టులు ఉండగా.. ఇందులో ఏపీలో 428 పోస్టులు, తెలంగాణలో(Telangana) 307 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు రూ.100. ఎస్సీ,ఎస్టీ,మహిళా అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష ఫీజు లేదు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. జూన్ 20 నుంచి 25 వరకు సీబీటీ పరీక్షకు అడ్మిట్‌కార్డులు విడుదల చేస్తారు. కంప్యూటర్ బేస్డ్‌టెస్ట్,(Computer Based Test) ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్‌టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) జులై 1 నుంచి 13 వరకు నిర్వహిస్తారు.ఈ ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఇంగ్లిష్/ హిందీలో ఉంటుంది. ఉద్యోగంలో భర్తీ అనంతరం వేతన స్కేలు : రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. కాగా, కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలకు 21 నుంచి 27 ఏళ్లు వయో పరిమితి( Age limit)విధించారు. ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ల వయో సడలింపు ఇవ్వగా.. ఓబీసీలు, ఎక్స్ సర్వీస్మెన్లకు (ex servicemen) మూడేళ్ల పాటు సడలింపు ఇచ్చారు.
చదవండి :విద్యాదీవెన నిధులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ..!