»Digital Payments Ecosystem Has Radically Transformed Governance
Narendra Modi: డిజిటల్ చెల్లింపుల విప్లవంపై ప్రధాని
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ఇలాంటి సమయంలో భారత్ అమలు చేసిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ఇలాంటి సమయంలో భారత్ అమలు చేసిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం బెంగళూరులో నిర్వహించిన జీ -20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల ను ఉద్దేశించి మాట్లాడారు.
భారతీయ వినియోగదారులు, ఉత్పత్తిదారులు దేశ ఆర్థిక రంగం పట్ల చూపిన ఆశావాదం నుండి జీ 20 సమావేశంలో పాల్గొన్న ప్రపంచ దేశాల ఆర్థిక వేత్తలు స్ఫూర్తి పొందాలన్నారు. ప్రపంచమంతా ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఇంధన, ఆహార భద్రత సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు ఉత్తమ పరిష్కారాలను అందిస్తాయని విశ్వసించారు. డిజిటల్ విప్లవం ఎన్ని మార్పులు తెచ్చింది అని చెప్పారు.