తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ‘సత్యం సుందరం’ మూవీ ఈ నెల 28న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ మెగా హీరో సాయి ధరమ్ ట్వీట్ చేశాడు. తాజాగా దీనిపై స్పందించిన కార్తీ.. స్వీట్ రిప్లై ఇచ్చాడు. ‘బ్రదర్.. ప్రేమ, ఆప్యాయతతో మీరు ఎల్లప్పుడూ మంచి మనసు చాటుకుంటారు. మీ విషెష్కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ మూవీకి సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు.