»What About Pushpa Pushpa Song Released From Allu Arjun Pushpa 2
Pushpa2: పుష్ప2 ఫస్ట్ సాంగ్ విడుదల.. అనుకున్నంత ఉందా?
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న పుష్ప సాంగ్ వచ్చేసింది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య విడుదలైన ఈ పాట శ్రోతల్ని ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం.
Pushpa2: పుష్ప2 చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ విడుదైలయింది. టీజర్‌తో అందరిలో మంచి అంచనాలు పెంచి తాజాగా విడుదల చేశారు. ఈ సాంగ్ బన్ని ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. ఆస్కార్ విన్నర్ ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ రాసిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యాజిక్ అందించారు. పాట విడులకు ముందే ఫ్యాన్స్, ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు పెంచడంతో తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్‌పై కొంత ప్రభావం పడింది అని చెప్పవచ్చు. అయితే పాటలోని అర్థం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఒక మనిషి పుష్పలా ఎలా ఎదగాలో చెప్పే ప్రయత్నం చేశాడు పాటల రచయిత.
చంద్రబోస్ కలం గురించి అందరికీ తెలిసిందే. చీకట్లను చీల్చే అక్షరకిరణాలతో శ్రోతల బ్రైన్లో పయనిస్తాడు చంద్రబోస్. అలాంటి మోటివేషనల్ సాంగ్స్ ఆయన చాలానే రాశారు. పుష్ప మొదటి పార్ట్‌లో కథనాయకుడిని ఎం చేసిన అందులోనే తిరుగులేకుండా ఎదుగుతాడు అని.. ఏ బిడ్డా ఇది నా అడ్డా అనే పాటలో చెప్పారు. ఇక ఇందులో పుష్ప ఎదిగిన తీరు చెబుతూనే అతని విజయానికి కొలమానం లేదని రాశాడు. వానలో తడుస్తూ గువ్వలా వణిపోవడం నీ తప్పు, గద్దాల మబ్బులను దాటి విహరించు ఆ వర్షం నీ కాళ్ల కింద ఉంటుందని రాశాడు. ఇక పుష్ప ఎత్తును తాకలాంటే ఆకాశం ఇంకా ఎదగాలి, పుష్పను కోలవాలంటే సముద్రం ఇంకా లోతుకు వెళ్లాలి అని అద్భుతమైన లైన్లు రాశాడు. పాటలో కొన్ని డిటైల్స్ కూడా ఇచ్చాడు డైరెక్టర్ సుకుమార్. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్ప ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. అందుకోసం, పుష్ప ధరించే షర్ట్స్, గోల్డ్ కాయిన్స్‌పై అతని బ్రాండ్ ఉండేలా హ్యాండ్ సింబల్ ఉంటుంది. ఇక మొత్తానికి ఈ పాట ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు.