విజయ్ దేవరకొండ – పరశురామ్(Parashuram) – దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా పూజా కార్యక్రమం హైదరాబాదు(Hyderabad)లో ఘనంగా జరిగింది.ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur) కథానాయికగా నటించనుందనే టాక్ కూడా గట్టిగానే వినిపించింది. అనుకున్నట్టుగానే ఆ ప్రాజెక్టును కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఫస్ట్ షార్ట్ ను గోవర్ధన్ రావు దేవరకొండ డైరక్ట్ చేశారు, ప్రముఖ ఫైనాన్షియర్ సత్తి రంగయ్య కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. సీతారామం సినిమా(Seetharam movie)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి అందరినీ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 54 వ చిత్రంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. ఈ సినిమాభారీ బడ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ‘గీత గోవిందం(Gita Govindam)’ తరువాత విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ ఇది.’గీత గోవిందం’ ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో మంచి రేటింగును నమోదు చేస్తూ ఉంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా కోసం ఎప్పటి నుంచో ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అది ఇప్పటికి కుదిరిందన్న మాట. హీరో నాని (Hero nani) జోడీగా ఒక సినిమా చేస్తున్న మృణాల్ ఠాకూర్, హఠాత్తుగా విజయ్ దేవరకొండ సరసన మెరవడం విశేషం.