ఐపీఎల్ చైన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తరుపున అద్బుంగా రాణించిన యువ పేసర్ తుషార్ దేశ్ పాండే(Tusshar Desh Pandey) ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలై నభ గడ్డం (Nabhagaddam) తో ఎంగేజ్మెంట్ జరిగింది .ఐపీఎల్ రెండు నెలల పాటు సాగే సీజన్. సరిగ్గా పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఈ సీజన్ లోనే ఉంటుంటాయి. దీంతో ఐపీఎల్ (IPL) ముగిసీ ముగియగానే గైక్వాడ్ పెళ్లి పూర్తి చేసుకున్నాడు.ఇక, స్కూల్ లో తనతోపాటు కలసి చదువుకున్న తన ప్రేయసి, నభా గద్దంవర్ ను పాండే వివాహం చేసుకోనున్నాడు.
వీరి పెళ్లి నిశ్చితార్థం(Engagement) ముంబైలో జరిగింది. పాండే తన దేశవాళీ క్రికెట్ ముంబై (Mumbai) తరఫునే ఆడాడు. ‘‘ఆమె నా స్కూల్ నుంచి నా జీవిత భాగస్వామిగా పదోన్నతి పొందింది’’ అంటూ దేశ్ పాండే పోస్ట్ పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఇన్ స్టా గ్రామ్ (Instagram) లో షేర్ చేశాడు. సీఎస్కే ఓపెనర్ తురురాజ్ గైక్వాడ్ (Thurraj Gaikwad) దేశ్ పాండేకి వివాహితుల క్లబ్ లోకి ఆహ్వానం పలికాడు. క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) , సిమర్ జీత్ సింగ్ శుభాకాంక్షలు చెప్పారు. పాండే తో కలసి దేశవాళీ క్రికెట్ లో ముంబైకి, సీఎస్కేలోనూ ఆడిన శివమ్ దూబే (Shivam Dubey) మాత్రం ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ప్రస్తుతం నిశ్చితార్థ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.