టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan Tej) , ఉపాసన(Upasana) జంటకు పేరుంది. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అయిన వీరు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఉపాసన(Upasana)కు తన ఫ్రెండ్స్ ఇంట్లో చిన్నపాటి సీమంతం చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి(Mega star chiranjeevi)కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. స్వయంకృషితో సినీ ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగారు. నేడు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. మెగా కాంపౌండ్ నుంచి చాలా మంది హీరోలు వచ్చి తమ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్నారు. మెగా వారసుడిగా రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) ఇండస్ట్రీలోకి వచ్చి నేడు పాన్ ఇండియా స్టార్‌గా కొనసాగుతున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan Tej) ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్(RRR) ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఆ సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలో ఉంది. మరో వైపు మెగా కుటుంబంలో సందడి మొదలైంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan Tej) , ఉపాసన(Upasana) జంటకు పేరుంది. వీరిద్దరికీ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ జంటకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తి చూపుతుంటారు. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అయిన వీరు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. 2012లో రామ్ చరణ్(Ram Charan Tej) , ఉపాసన కు వివాహమైంది. ఉపాసన తల్లికాబోతున్న వార్తను వెల్లడించడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేవు. రామ్ చరణ్, ఉపాసన(Upasana)లు పేరెంట్స్ కాబోతున్నట్లు తెలియడంతో మెగా ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత ఉపాసన తల్లికాబోతుండటంతో మెగా ఇంట సంబరాలు ప్రారంభమయ్యాయి. తాజాగా ఉపాసన ఫ్రెండ్స్ ఒక చిన్నపాటి సీమంతాన్ని కూడా చేశారు.
ఉపాసన(Upasana)కు తన ఫ్రెండ్స్ ఇంట్లో చిన్నపాటి సీమంతం చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన మెడలో పూల దండ వేసిన ఫ్రెండ్స్ ఆమెకు బహుమతులను కూడా అందించారు. ఆ వేడుకకు ఉపాసన(Upasana), చరణ్ తో పాటు స్నేహితులు, సన్నిహితులు కూడా వచ్చారు. ఆ సందర్భంగా దిగినటువంటి ఫోటోలను ఉపాసన(Upasana) తన ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. బేబీ కమింగ్ సూన్ అంటూ చరణ్ సతీమణి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఉపాసన, రామ్ చరణ్ లు ఈ సీమంతం వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్(Ram Charan Tej) దర్శకుడు శంకర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆర్సీ15 అనే టైటిల్ తో ఆ సినిమా రూపొందుతోంది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కూడా తన కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. మొత్తానికి ఉపాసన(Upasana)కు తన ఫ్రెండ్స్ చేసిన సీమంతంతో మెగా ఫ్యామిలీలో సందడి మొదలైంది.