KRNL: సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమంలో భాగంగా మంగళవారం మాంత్రికి గ్రామంలో నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామస్థులతో కలిసి పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తూ.. పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం సాధ్యమన్నారు.