WGL: మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల ఉమ్మడి WGL జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా స్తంభించే పరిస్థితి ఏర్పడింది. ఒక WGL జిల్లాలో రోజుకు సుమారు 2,150 సిలిండర్ల అవసరం ఉండగా, స్టాక్ దాదాపు అయిపోయిందని డీలర్లు తెలిపారు. దీంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, హాస్టెల్స్ నిర్వాహకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.