విశాఖలో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు టూటౌన్ ఎస్సై మన్మధరావు మంగళవారం తెలిపారు. కొబ్బరి తోటలో నివాసం ఉంటున్న యువకుడు బర్రె శివ ఇంట్లోనే ఉరివేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుని మెడపై గాయాలు ఉండడంతో హత్యా? ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.