PPM: నందివానివలస గ్రామ పరిసర ప్రాంతమైన తామరచెరువు వద్ద మంగళవారం ఉదయం ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు, రైతులు పొలాలకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో అడవి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.