మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) భార్య ఉపాసన గర్భవతి అని తెలిసిందే. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన (Upasana) దంపతులు తమ 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. త్వరలోనే తమ జీవితంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించబోతున్నారు. ఈ నేపథ్యంలో, ఉపాసన ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాము త్వరలోనే తమ అత్తయ్య గారింటికి వెళ్లిపోతున్నామని తెలిపారు. పుట్టబోయే బిడ్డ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్, తాను వేరే ఇంటిలో ఉంటున్నామని, అయితే, ఇకమీదట అత్తమామలతోనే ఉండాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. పిల్లల ఎదుగుదలలో గ్రాండ్ పేరెంట్స్(Grand parents) ప్రభావం కీలకం అని, తమ బిడ్డ కూడా అలాంటి వాతావరణంలో పెరగాలన్న ఉద్దేశంతోనే అత్తయ్య వాళ్లింటికి షిఫ్ట్ అవుతున్నట్టు ఉపాసన వివరించారు.
గ్రాండ్ పేరెంట్స్ నుంచి తాను, రామ్ చరణ్ ఎంతో నేర్చుకున్నామని, పుట్టబోయే తమ బిడ్డకు ఆ అవకాశాన్ని, ఆనందాన్ని దూరం చేయాలనుకోవడంలేదని తెలిపారు.ఉపాసన సైతం తనకు పుట్టబోయే బిడ్డకోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. బేబీ ఆరోగ్యం (Baby’s health) కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఉపాసన వెల్లడించింది. అంతేకాకుండా బేబీ కార్డ్ బ్లడ్(Baby cord blood) బ్యాంక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో బేబీతో పాటు ఫ్యామిలీ ఆరోగ్యం కోసమే అత్యాధునిక పద్ధతిలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ విధానం ఎంచుకున్నట్లు పేర్కొంది.స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే.. బొడ్డు తాడు దాచుకోవడం. భవిష్యత్తులో బిడ్డకు ఏవైనా ఆనారోగ్య సమస్యలు వస్తే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధానం స్టెమ్ సైట్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. ఆ సంస్థ ద్వారా ఉపాసన బిడ్డ కార్డు బ్లడ్ సేకరించి భద్రపరచనున్నారు. ఈ విధానంపై మన దేశంలో పెద్దగా అవగాహన లేదు. అయితే, గతంలో మహేశ్ బాబు (Mahesh Babu)సతీమణి నమ్రత కూడా తమ పిల్లల విషయంలో ఇలాంటి జాగ్రత్తలే తీసుకుంది.