టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati srinu) కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోంది. నేడు రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి చిన్న టీజర్ లాంటి వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ఫస్ట్ థండర్ పేరుతో రిలీజ్ అయ్యింది. 1.08 నిమిషాల వీడియోలో మూవీలోని యాక్షన్ సీన్స్ కట్ చేస్తూ రిలీజ్ చేశారు. టీజర్(Teaser)లోని ప్రతి ఫేమ్ లో కూడా బోయపాటి మార్కు కనిపిస్తుంది.
రామ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో:
టీజర్(Teaser)లో డైలాగ్స్ అదిరిపోయాయి. నీ స్టేట్ దాటలేను అన్నావ్ దాటా, నీ గేట్ దాటలేను అన్నావ్ దాటా, నీ పవర్ దాటలేను అన్నావ్ డాటా, ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్సూ..అంటూ చెప్పే డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. టీజర్లో దున్నపోతుతో చేసే ఫైట్ అదిరిపోయిందని చెప్పాలి. ఈ మూవీకి థమన్(Thaman) సంగీతం అందించారు.
రామ్ పోతినేని (Ram Pothineni) పేరును షార్ట్ కట్లో రా.పో. అని అంటారు. అదే పదంతో ‘ర్యాపో’ అంటూ వచ్చే పాట హైలైట్ గా నిలిచింది. ఈ టీజర్ కు పాట మరింత హైప్ ను తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా కోసం రామ్ చాలా బరువు పెరిగినట్టు తెలుస్తోంది. మొదటిసారి రామ్ మాస్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల(Srileela) హీరోయిన్ గా చేస్తోంది.