అభిమానుల కోసం ఆరాట పడే హీరోల్లో ప్రభాస్, మహేష్ ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. మామూలుగా తమ తమ అభిమానుల కోసం ఏదో ఒకటి చేస్తునే ఉంటారు ఈ స్టార్ హీరోలు. అయితే సాధారణ పరిస్థితుల్లో ఫ్యాన్స్‌కు కోసం చేసే పనులు కామన్. కానీ పుట్టెడు దుఖంలో కూడా ఫ్యాన్స్ గురించి ఆలోచించడమంటే మామూలు విషయం కాదు. అదికూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేష్ బాబు.. తన అభిమానుల గురించి ఆరా తీయటం..
అభిమానానికే అభిమానం అని చెప్పొచ్చు. ఈ ఏడాదిలో ముగ్గురిని కొల్పొయారు మహేష్. కరోనా సమయంలో అన్న రమేష్ బాబు.. కొన్ని రోజుల క్రితం తల్లి ఇందిరా దేవి.. ఇప్పుడు తండ్రి సూపర్ స్టార్ కృష్ణను కోల్పోయారు. ఇంతటి భాదలో కూడా అభిమానుల కోసం భోజనాలు ఏర్పాట్లు చేశాడు మహేష్. సూపర్ స్టార్ కృష్ణను కడసారి చూసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. హైదరాబాద్‌లో తిండీతిప్పలు లేకుండా పడిగాపులు కాశారు. ఇది గమనించిన మహేష్ బాబు.. వాళ్లందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.
దాంతో మా కోసం.. మా మహేష్ బాబు భోజనం ఏర్పాటు చేశారంటూ ఎమోషనల్ అవుతున్నారు అభిమానులు. గత కొద్ది రోజుల క్రితం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన సమయంలోను.. ప్రభాస్ తన అభిమానుల కోసం ఇలాగే చేశాడు.
ఆ తర్వాత తన స్వగ్రామమైన మొగల్తూరులో సంస్మరణ సభ భారీగా నిర్వహించి.. భోజనాలు పెట్టించారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు కూడా అలాగే చెయ్యడంతో.. ఇది కదా అభిమానం అంటున్నారు. తమ అభిమాన హీరోలను కోల్పోయామనే బాధలో ఉన్నప్పటికి.. ప్రభాస్, మహేష్ విషయంలో రెబల్ స్టార్, ఘట్టమనేని అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.