»The Lady Villain Varalakshmi Who Went To Jail Sarath Kumar Told The Shocking Story
Varalakshmi: జైలుకెళ్లిన లేడీ విలన్ వరలక్ష్మి..షాకింగ్ విషయం చెప్పిన శరత్ కుమార్
టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు వరలక్ష్మీ శరత్ కుమార్(Varalakshmi Sharath kumar). హీరోయిన్గా అంతగా మెప్పించలేని వరలక్ష్మీ లేడీ విలన్(Lady Villan)గా రాణిస్తోంది. 'పందెం కోడి2' సినిమాలో లేడీ విలన్ గా అదరగొట్టింది. అప్పటి నుంచి ఆమెకు నెగెటివ్ క్యారెక్టర్స్ రావడం మొదలైంది. తెలుగులో ఆమెకు వరుస లేడీ విలన్ క్యారెక్టర్స్ వచ్చాయి. తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బి, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి వంటి సినిమాల్లో ఆమె నెగిటివ్ రోల్స్(Negative Roles) చేసి మెప్పించింది. తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు వరలక్ష్మీ శరత్ కుమార్(Varalakshmi Sharath kumar). హీరోయిన్గా అంతగా మెప్పించలేని వరలక్ష్మీ లేడీ విలన్(Lady Villan)గా రాణిస్తోంది. ‘పందెం కోడి2’ సినిమాలో లేడీ విలన్ గా అదరగొట్టింది. అప్పటి నుంచి ఆమెకు నెగెటివ్ క్యారెక్టర్స్ రావడం మొదలైంది. తెలుగులో ఆమెకు వరుస లేడీ విలన్ క్యారెక్టర్స్ వచ్చాయి. తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బి, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి వంటి సినిమాల్లో ఆమె నెగిటివ్ రోల్స్(Negative Roles) చేసి మెప్పించింది. తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
ఈమధ్య తెలుగులో నాంది, పక్కా కమర్షియల్, మైఖేల్ వంటి సినిమాల్లోనూ కీ రోల్స్(Key Roles) చేసింది. ప్రస్తుతం ఆమె హనుమాన్, శబరి వంటి సినిమాలతో పాటుగా అరడజను సినిమాల్లో లేడీ విలన్(Lady Villan)గా చేస్తోంది. మార్చి 5న ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ వస్తున్నారు. తాజాగా వరలక్ష్మీ(Varalakshmi) నటించిన ‘కొండ్రాల్ పావమ్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఈవెంట్ లో వరలక్ష్మీ తండ్రి శరత్ కుమార్(Sharath Kumar) తన కూతురి గురించి పలు విషయాలను తెలిపారు.
ఇప్పుడంతా వరలక్ష్మి(Varalakshmi)ని విజయశాంతితో పోలుస్తున్నారని, అది వాస్తవమేనని అన్నారు. తన కూతురు సినిమాల్లోకి వస్తానంటే ఇప్పుడు అవసరమా అని అడిగానని, కానీ వరలక్ష్మి సినిమాలు చేయడానికే సిద్దమైందని శరత్ కుమార్(Sharath Kumar) తెలిపారు. ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి ఆమె పడిన కఠిన శ్రమే కారణమన్నారు.
వరలక్ష్మి(Varalakshmi) చాలా ధైర్యవంతురాలని, ఓ రోజు రాత్రి పోలీస్ స్టేషన్ లో ఉందని, ఇద్దరబ్బాయిలను కొట్టిందని శరత్ కుమార్(Sharath Kumar) తెలిపారు. తన కారుకు డ్యాష్ ఇవ్వడంతో ఇద్దరబ్బాయిలను వరలక్ష్మి చితకబాదినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శరత్ కుమార్ చేసిన ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరలక్ష్మి(Varalakshmi) ధైర్యానికి నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.