ATP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటలకు అనంతపురం జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళా సాధికారత, బాల్య వివాహాల నిర్మూలన వంటి రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను సత్కరిస్తామని చెప్పారు.