VSP: కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలుడు అక్షయ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు కాలు విరిగిన బాలుడికి శస్త్రచికిత్స సమయంలో మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడంతో కోమాలోకి వెళ్లాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని తెలిపారు. శనివారం ఆస్పత్రిలో బాలుడికి పది వేలు సాయం చేశారు.